Tue Jan 20 2026 17:58:18 GMT+0000 (Coordinated Universal Time)
8ఏళ్ల బాలికపై వృద్ధుడి లైంగిక దాడి
బాలిక తల్లిదండ్రులు కూలి పనుల నిమిత్తం బయటికి వెళ్లారు. ఇంట్లో బాలిక ఒక్కటే ఉందని గమనించిన వృద్ధుడు..

ఆడపిల్లల పై జరిగే దారుణాలపై ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని శిక్షలు వేసినా కామాంధుల ఆలోచనా శైలిలో ఏమాత్రం మార్పు రావడం లేదు. నిత్యం ఏదొక మూల ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా.. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం గోపవరంలో మరో దారుణం వెలుగుచూసింది. మనుమరాలి వయస్సున్న బాలికపై వృద్ధుడు లైంగిక వేధింపులకు పాల్పడటం సంచలనం రేపింది.
Also Read : మార్చి రాకుండానే.. మండుతున్న ఎండలు !
బాలిక తల్లిదండ్రులు కూలి పనుల నిమిత్తం బయటికి వెళ్లారు. ఇంట్లో బాలిక ఒక్కటే ఉందని గమనించిన వృద్ధుడు.. అదే అదనుగా భావించి ఎనిమిదేళ్ల పసిమొగ్గపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక భయంతో కేకలు వేయడంతో.. అతను అక్కడి నుంచి పరారయ్యాడు. ఇంటికొచ్చాక విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

