Mon Oct 07 2024 14:20:03 GMT+0000 (Coordinated Universal Time)
మేనత్త బాలుడిని లోబర్చుకుని.. లైంగికంగా?
హైదరాబాద్ లో అమానవీయ సంఘటన జరిగింది. జూబ్లీహిల్స్ లోని ఒక బాలుడిపై లైంగిక దాడి జరిగింది
హైదరాబాద్ లో అమానవీయ సంఘటన జరిగింది. జూబ్లీహిల్స్ లోని ఒక బాలుడిపై లైంగిక దాడి జరిగింది. మేనత్త బాలుడి పాలిట శాపంగా మారింది. అంతటితో ఆగకుండా బంగారం, నగదును ఆ బాలుడిని బెదిరించి కాజేసింది. జూబ్లీహిల్స్ లో నివాసముంటున్న ఒక కుటుంబంలో ఈ ఘటన జరిగింది. బాలుడి మేనత్త బెంగళూరులో నివాసముంటుంది. మాయమాటలు చెప్పి ఆ బాలుడిని లోబర్చుకుంది.
లాడ్జీకి తీసుకు వెళ్లి....
హైదరాబాద్ వచ్చినప్పుడు ఆమె లాడ్జీలోకి దిగి స్కూల్ నుంచి తీసుకెళ్లి ఆ బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడింది. బాలుడితో లైంగిక వేధింపులకు పాల్పడేటప్పుడు ఆమె ప్రియుడు వీడియోను చిత్రీకరించారు. వీడియోను చూపి ఆ బాలుడిని బెదిరించి ఇరవై తులాల బంగారాన్ని కాజేశారు. బంగారంతో పాటు నగదును కూడా బెదిరించి తీసకున్నారు. బంగారం కన్పించకపోవడంతో బాలుడి తల్లి నిలదీయడంతో జరిగిన విషయాన్ని చెప్పాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. మూడేళ్ల క్రితం ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
Next Story