Thu Mar 19 2026 05:34:22 GMT+0530 (India Standard Time)
విశాఖ ఎక్స్ ప్రెస్ లో దోపిడీకి యత్నం
విశాఖపట్నం రైల్వే ఎక్స్ ప్రెస్ లో చోరీకి యత్నించిన ఘటన వెలుగు చూసింది

విశాఖపట్నం రైల్వే ఎక్స్ ప్రెస్ లో చోరీకి యత్నించిన ఘటన వెలుగు చూసింది. అయితే రైల్వే పోలీసులు కాల్పులు జరపడంతో దొంగలు పారిపోయారు. గంటూరు జిల్లా పిడుగు రాళ్ల మండలం తుమ్మల చెరువు వద్ద ఈ ఘటన జరిగింది. బీహార్, మహారాష్ట్ర గ్యాంగ్ లు దోపిడీకి పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నారు. మూడు రౌండ్లు రైల్వే పోలీసులు కాల్పులు జరపడంతో వారు పరారయ్యారు.
ఏడుగురు గ్యాంగ్...
ఈ గ్యాంగ్ లో మొత్తం ఏడుగురున్నట్లు తెలిసింది. రిజర్వేషన్ బోగీలలో చోరీకి ప్రయత్నం చేయడంతో రైల్వే పోలీసులు కాల్పులు జరిపారు. హైదరాబాద్ నుంచి విశాఖ వెళుతున్న ఈ రైలులో చోరీకి పాల్పడుతున్నట్లు తెలిసింది. వారం రోజుల్లో ఇది రెండో ఘటన అని ప్రయాణికులు చెబుతున్నారు. విశాఖ ఎక్స్ ప్రెస్ లో దోపిడీకి యత్నించడంతో పోలీసులు మరింత భద్రతను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Next Story

