Sun Mar 15 2026 22:53:15 GMT+0530 (India Standard Time)
సీబీఐ తనిఖీల పేరుతో దోపిడీ
సీబీఐ సోదాల పేరుతో ఒక ఇంటిని గుర్తు తెలియని వ్యక్తులు దోచుకున్నారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఈ ఘటన జరిగింది.

సీబీఐ సోదాల పేరుతో ఒక ఇంటిని గుర్తు తెలియని వ్యక్తులు దోచుకున్న సంఘటన జరిగింది. హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఈ ఘటన జరిగింది. గచ్చిబౌలిలో నివాసముంటున్న సుబ్రమణ్యం అనే వ్యక్తి ఇంటికి కొందరు అధికారుల వేషాల్లో వచ్చారు. తాము సీబీఐ నుంచి వచ్చినట్లు, సోదాలు నిర్వహించాలని చెప్పారు. కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.
కిలోన్నర బంగారం...
సీబీఐ అధికారుల వేషాల్లో వచ్చిన వారు కిలోన్నర బంగారంతోపాటు భారీగా నగదును స్వాధీనం చేసుకుని వెళ్లినట్లు సమాచారం. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

