Thu May 22 2025 06:07:21 GMT+0000 (Coordinated Universal Time)
డాక్టర్ మర్డర్ ప్లాన్ వెనక ఇంత కథ ఉందా? వరంగల్ లో హత్యాయత్నంలో వీడిన మిస్టరీ
ప్రియుడి కోసం భర్తనే భార్య చంపే ప్రయత్నం చేసిన ఘటన వరంగల్ లో జరిగింది

ప్రియుడి కోసం భర్తనే భార్య చంపే ప్రయత్నం చేసిన ఘటన వరంగల్ లో జరిగింది. ఈ నెల 20వ తేదీన బట్టుపల్లి అమ్మవారిపేట క్రాస్ రోడ్స్ వద్ద డాక్టర్ సుమంత్ రెడ్డిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హత్యకు ప్రయత్నం చేశారు. యాక్సిడెంట్ గా చిత్రీకరించాలనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే వారి ప్లాన్ బెడిసి కొట్టింది. డాక్టర్ సుమంత్ రెడ్డిపై హత్యాయత్నం కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించగలిగారు. ప్రియుడితో కలిసి భర్తను చంపాలని భార్య పథకం వేసినట్లు గుర్తించారు. ఈ హత్య ప్రయత్నంలో జరిగిన కుట్రలో ఒక ఏఆర్ కానిస్టేబుల్ కూడా సహకరించడం విశేషం. వరంగల్ ఏసీబీ నందిరామ్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. ఈ నెల 20వ తేదీన జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వివరాలను బయటపెట్టారు.
డాక్టర్ గా పనిచేస్తూ...
సుమంత్ రెడ్డి 2018లో సంగారెడ్డి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో కాంట్రాక్టు పద్ధతిన మెడికల్ ఆఫీసర్ గా పనిచేశారు. అంతకు ముందే అంటే 2016లో ఫ్లోరా మరియా అనే యువతిని వివాహం చేసుకున్నారు. మరియా సెయింట్ ఆంథోని స్కూల్ లో టీచర్ గా పనిచేసంది. అయితే వారిద్దరికి పిల్లలు పుట్టలేదు. థైరాయిడ్ కారణంగానే పిల్లలు పుట్టలేదని వైద్యులు చెప్పడంతో మరియా ఒక జిమ్ లో చేరింది. జిమ్ లో చేరిన మరియాకు అక్కడ కోచ్ గా పనిచేస్తున్న సామ్యూల్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం తెలిసిన సుమంత్ రెడ్డి మరియాను హెచ్చరించారు. అలాంటి పనులు చేయవద్దంటూ హితవు పలికారు.
వరంగల్ కు మార్చినా..
తర్వాత సిద్ధిపేట నుంచి తనమకాంను వరంగల్ కు మార్చారు. వరంగల్ లోని ఖాజీపేటలో సొంత హాస్పిటల్ సుమంత్ రెడ్డి పెట్టుకున్నారు. అయితే వరంగల్ కు మారినా మరియా బుద్ధి మారలేదు. తాను ఒక డిగ్రీ కళాశాలలో టీచర్ గా పనిచేస్తూ సామ్యుల్ తో సంబంధం కొనసాగించేందని ఏసీపీ మీడియాకు వివరించారు. సుమంత్ రెడ్డి లేని సమయంలో శామ్యూల్ వరంగల్ వచ్చేవాడు. ఈ విషయం తెలిసిన సుమంత్ రెడ్డి ఇద్దరిని మందలించడంతో డాక్టర్ సుమంత్ రెడ్డిని చంపేందుకు స్కెచ్ వేశారు.శామ్యూల్ మారణాయుధాలను కొనుగోలు చేసి కారులో ఆసుపత్రి నుంచి ఇంటికి వస్తుండగా శామ్యూల్, మరియా, ఏఆర్ కానిస్టేబుల్ కలిసిదాడి చేశారు.రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. సుమంత్ రెడ్డిని సుత్తితో కొట్టారు. చనియాడని భావించి వెళ్లిపోయారు. కానీ సుమంత్ రెడ్డి గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి విచారణ చేసి న్యాయస్థానంలో హాజరుపర్చారు. సుమంత్ రెడ్డి విడాకులకు సహకరించకపోవడం వల్లనే హత్యకు ప్లాన్ చేశామని నిందుతులు పోలీసుల విచారణలో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Next Story