Thu Mar 19 2026 04:28:31 GMT+0530 (India Standard Time)
Braeking : సిలిండర్ పేలుడు : ఇద్దరు సజీవదహనం
గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు సజీవదహనం అయిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది.

గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు సజీవదహనం అయిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. మెదక్ జిల్లాలోని చేగుంట మండలం శివునూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించారని పోలీసులు తెలిపారు. మృతులు ఎవరన్నదీ ఇంకా తెలియరాలేదు.
గుర్తుపట్టలేని స్థితిలో..
పేలుడు ధాటికి ఇల్లు ధ్వసంమైంది. మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వచ్చి అక్కడ పరిస్థితిని సమీక్షించారు. సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

