Sat Mar 07 2026 20:26:19 GMT+0530 (India Standard Time)
బాలికపై యాసిడ్ దాడి
రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. 12వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ దాడి చేశారు

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. 12వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ దాడి చేశారు. ఈ ఘటనలో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన బాలికను సప్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెకు చికిత్స అందిస్తున్నారు. యాసిడ్ దాడిలో గాయపడిన బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. 24 గంటలు గడిస్తే కాని పూర్తి స్థాయి పరిస్థితి చెప్పలేమని అంటున్నారు.
సీసీ టీవీ ఫుటేజీలో...
ద్వారకామోడ్ ప్రాంతంలో ఈ ఘటన ఈరోజు ఉదయం చోటు చేసుకుంది. ఉదయం స్కూల్ కు బయలేదేరిన బాలికపై బైక్ వచ్చిన ఇద్దరు వ్యక్తులు యాసిడ్ చల్లారు. సీసీ టీవీ ఫుటేజీలో రికార్డు అయింది. అయితే బాలికపై యాసిడ్ దాడి చేసింది ఎవరన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలిస్తున్నారు. బాలికకు తెలిసిన వారే ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
- Tags
- acid attack
- delhi
Next Story

