Tue Mar 03 2026 17:53:17 GMT+0530 (India Standard Time)
నెల్లూరులో దారుణం.. దంపతుల హత్య
నెల్లూరులో దారుణం చోటుచేసుకుంది. భార్యాభర్తలను దొంగలు హత్య చేశారు.

నెల్లూరులో దారుణం చోటుచేసుకుంది. భార్యాభర్తలను దొంగలు హత్య చేశారు. నెల్లూరు మినీ బైపాస్ రోడ్డులోని పడారుపల్లి అశోక్‌నగర్ లో ఈ ఘటన జరిగింది. దోపిడికి ప్రయత్నించిన దొంగలు తొలుత వాసిరెడ్డి సునీతమ్మను హత్య చేశారు. అప్పుడే ఇంటికి వచ్చిన భర్త కృష్ణారావు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఆయనను కూడా దోపిడీ దొంగలు హత్య చేయడం నెల్లూరు టౌన్ లో కలకలం రేపింది.
దోపిడీ దొంగల పని?
ఇంట్లో ఉన్న బంగారం, నగలు, నగదు దోచుకెళ్లారు. దోపిడీ దొంగల పని అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. సీసీ టీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. దొంగలు దోపిడీకి పాల్పడి ఏ రూట్లో పారిపోయారన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఉదయాన్నే ఇంటికి వచ్చిన పాలు పోసే వ్యక్తి గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరి కోసం ప్రత్యేక బృందాలను నియమించారు.
Next Story

