Fri Mar 20 2026 00:27:38 GMT+0530 (India Standard Time)
భర్తను చంపిన భార్య.. ఎందుకో తెలిస్తే షాకే
కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భర్తను రోకలి బండతో భార్య చంపిన వెలుగు చూసింది.

కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భర్తను రోకలి బండతో భార్య చంపిన వెలుగు చూసింది. కృష్ణా జిల్లా ఆముదాల లంకలో ఈ ఘటన వెలుగు చూసింది. తనకు అక్రమ సంబంధాలను అంటగడుతున్నాడని భర్తను వరలక్ష్మి రోకలి బండతో బాది హత్య చేసింది. గతంలోనూ తన పిల్లలను, తనను భర్త హింసిస్తున్నాడని ఆమె భర్తకు ఎలుకలు మందు పెట్టింది. అప్పట్లో ఆ భర్తకు ప్రాణాపాయం తప్పింది.
పక్కా ప్లాన్ తో...
అయితే ఈసారి పక్కా ప్లాన్ తో వ్యవహరించింది. తాగి వచ్చిన భర్త తలపై రోకలి బండతో మోది హత్య చేసింది. తనను, తన పిల్లలను హింసించడం కారణంగానే చంపానని ఆమె చెబుతోంది. పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆమెను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

