Wed Apr 01 2026 01:58:30 GMT+0530 (India Standard Time)
Breaking : మహిళను మింగేసిన నాలా
హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. మెట్టుగూడలో ఒక మహిళ నాలాలో కొట్టుకుపోయింది.

హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. మెట్టుగూడలో ఒక మహిళ నాలాలో కొట్టుకుపోయింది. అంబానగర్ వద్ద మహిళ మృతదేహాన్ని గుర్తించారు. మరణించిన మహిళ పారిశుద్ధ్య కార్మికురాలిగా భావిస్తున్నారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.
వరస ఘటనలతో...
హైదరాబాద్లో భారీ వర్షాలు కురిసినప్పుడల్లా నాలాలో పడి కొట్టుకుపోవడం మామూలుగా మారింది. చిన్న పిల్లల దగ్గర నుంచి మహిళల వరకూ నాలాలో పడి మరణించిన ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. భారీ వర్షం కురిసినప్పుడు వెళుతూ దారి తెలియక నాలాలో పడి కొట్టుకుపోతున్నారు. దీనిపై ఎన్నిసార్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు విన్నవించినా ఫలితం లేదు. వరస ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మరో మహిళ నాలాను మింగేసింది. వరస ఘటనలతో నగరవాసులు భయపడి పోతున్నారు.
- Tags
- hyderabad
Next Story

