Sun Mar 08 2026 02:40:09 GMT+0530 (India Standard Time)
Breaking : సెంట్రల్ వర్సిటీలో విద్యార్థినిపై అత్యాచార యత్నం
సెంట్రల్ యూనివర్సిటీలో దారుణం జరిగింది థాయ్లాండ్ విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారానికి ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దారుణం చోటు చేసుకుంది. థాయ్లాండ్ విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారానికి ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్న థాయ్లాండ్ విద్యార్థినిపై ప్రొఫెసర్ రవి రంజన్ అత్యాచారానికి ప్రయత్నించారన్న కేసు నమోదయింది.
ప్రొఫెసర్ పై కేసు నమోదు...
ఆమె తప్పించుకుని గచ్చిబౌలి పోలీసు స్టేషన్ కు పరుగులు తీసి అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ప్రొఫెసర్ రవిరంజన్ పై కేసు నమోదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనపై సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
Next Story

