Tue Mar 17 2026 05:02:37 GMT+0530 (India Standard Time)
టీడీపీ నేతపై హత్యాయత్నం.. పరిస్థితి విషమం
కాకినాడ జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేత పై హత్యాయత్నం జరిగింది. తుని పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

కాకినాడ జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేత పై హత్యాయత్నం జరిగింది. తుని పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎంపీపీ పొల్నాటి శేషగిరిరావుపై హత్యాయత్నం జరిగింి. భవానీ మాల వేసుకుని వచ్చిన దుండగుడు శేషగిరిరావుపై కత్తితో దాడి చేశాడు.
బలమైన గాయాలతో....
దీంతో శేషగిరిరావు చేతికి, తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడి చేసిన దుండగుడు వెంటనే బైక్ పై పారిపోయాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. శేషగిరిరావు పరిస్థితి విషమంగా ఉందని వైద్యుల తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

