Thu Mar 19 2026 08:50:53 GMT+0530 (India Standard Time)
తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం
తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లక్షల్లో ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది

తిరుపతి : తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లక్షల్లో ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అర్థరాత్రి మంటలు చెలరేగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. తిరుపతిలోని కరకంబాడి మార్గంలో ఉపాధ్యాయనగరలోని ఒక వేకెంట్ ల్యాండ్ లో ప్లాస్టిక్ పైపులున్నాయి. అయితే అకస్మాత్తుగా మంటలు వ్యాపించడంతో స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు.
రెండతస్థుల భవనానికి....
అయితే వారు వచ్చే లోపే ఖాళీ స్థలం పక్కనే ఉన్న రెండతస్థుల భవనానికి మంటలు వ్యాపించాయి. దీంతో భవనంలో ఉన్న వారందరూ బయటకు పరుగులు తీశారు. దీంతో ప్రాణనష్టం తప్పినట్లయింది. అయితే అగ్నిమాపక సిబ్బంది వెంటనే వచ్చి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పంపులు తగలబడిపోయాయని, లక్షల్లో నష్టం ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.
Next Story

