వాయుసేన రన్ వే తల్లీకొడుకు కలిసి అమ్మేశారు
తల్లి, కొడుకు కలిసి వాయుసేన రన్ వే ను అమ్మేశారు. నకిలీ పత్రాలతో భారత వాయుసేనకు చెందిన రెండో ప్రపంచ యుద్ధం నాటి ఎయిర్‌స్ట్రిప్‌ను అమ్మేశారు.

తల్లి, కొడుకు కలిసి వాయుసేన రన్ వే ను అమ్మేశారు. నకిలీ పత్రాలతో భారత వాయుసేనకు చెందిన రెండో ప్రపంచ యుద్ధం నాటి ఎయిర్‌స్ట్రిప్‌ను అమ్మేశారు. ఇదంతా కొందరు అధికారుల సహకారంతో జరిగింది. కోర్టు జోక్యంతో 28 ఏళ్ల తర్వాత ఈ విషయం బయటపడింది.
పాకిస్థాన్ సరిహద్దులోని ఫిరోజ్‌పుర్ జిల్లాలో ఈ అక్రమ విక్రయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 1962 భారత్-చైనా యుద్ధం, 1965, 1971 భారత్-పాకిస్థాన్ యుద్ధాల్లో కీలక పాత్ర పోషించిన రన్‌వేను అక్రమార్కులు తమ సొంతంగా ప్రకటించుకుని అమ్మేశారు. 1945 మార్చి 12న బ్రిటిష్ ప్రభుత్వం దీనిని రక్షణ అవసరాల కోసం స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి ఈ భూమి వాయుసేన ఆధీనంలోనే ఉంది. దుమిని వాలా గ్రామానికి చెందిన ఉషా అన్సాల్ అనే మహిళ, ఆమె కుమారుడు నవీన్ చంద్ స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి నకిలీ పత్రాలు సృష్టించారు. ఈ భూమిని తమ స్వంతమని చూపించి 1997లో పలువురు వ్యక్తులకు అక్రమంగా విక్రయించారు. 28 ఏళ్ల తర్వాత, కోర్టు జోక్యంతో అసలు విషయం బయటపడింది.