Fri Feb 14 2025 19:03:45 GMT+0000 (Coordinated Universal Time)
ఫుల్లుగా తాగి.. మద్యంమత్తులో వాగులో పడి మృతి
ఎన్టీఆర్ జిల్లా నందిగామ లో విషాదం చోటు చేసుకుంది. వంతెన రైలింగ్ వద్ద కూర్చుని మద్యం తగుగూ నీటి లో పడి మృతి చెందారు.

ఎన్టీఆర్ జిల్లా నందిగామ చందాపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. నందిగామ శివారు చందాపురం గ్రామం వద్ద నల్లవాగు మినీ బ్రిడ్జి పై కూర్చొని మద్యం సేవిస్తూ మద్యం మత్తులో వంతెన పై నుండి నీటిలో పడి ఇద్దరు మృతి చెందారు. మద్యం సేవించి వంతెన రైలింగ్ వద్ద కూర్చున్న వ్యక్తులు నీటీ లో పడి మృతి చెందారు.
వంతెనపై కూర్చుని మద్యం తాగుతూ...
మృతులు చందాపురం కి చెందిన సత్యం,జయరాజు గా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన వారు కనకపుడి సత్యం మాతంగి జయరాజు గా వీరిద్దరి స్వగ్రామం చందాపురం గ్రామం అని తెలిపారు. మద్యం మత్తులో పడి మరణించారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Next Story