Thu Mar 19 2026 01:07:17 GMT+0530 (India Standard Time)
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ స్నేహితురాలు ఆత్మహత్య
మె స్వస్థలం మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని. ‘ససురల్ సిమర్ కా’లో అంజలి భరద్వాజ్ గా.. ‘సూపర్ సిస్టర్స్’లో శివానీ శర్మ..

ప్రముఖ టీవీ నటి, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ స్నేహితురాలైన వైశాలి ఠక్కర్ (30) ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె బలవన్మరణం బుల్లితెర ఇండస్ట్రీలో తీవ్రకలకలం రేపింది. హిందీ సీరియల్స్ లో నటించిన వైశాలి ఏడాది కాలంగా మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌లో ఉంటోంది. తన ఇంట్లో ఉరివేసుకొని వైశాలి ఠక్కర్ ఆత్మహత్యకు పాల్పడినట్టు తేజాజీ నగర్ పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైశాలి నివాసం నుంచి పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.
కాగా.. ప్రేమ వ్యవహారమే ఆమె ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఆమె స్వస్థలం మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని. 'ససురల్ సిమర్ కా'లో అంజలి భరద్వాజ్ గా.. 'సూపర్ సిస్టర్స్'లో శివానీ శర్మ గా, 'విషయా అమృత్: సితార'లో నేత్రా సింగ్ రాథోడ్ గా, 'మన్మోహిని 2'లో అనన్య మిశ్రా గా నటించి మంచి పేరు తెచ్చుకున్న వైశాలి.. హిందీ బిగ్ బాస్ లోనూ పాల్గొంది. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు వైశాలి బెస్ట్ ఫ్రెండ్. అతని మరణంపై అప్పట్లో వైశాలి అనుమానాలు వ్యక్తం చేస్తూ.. సుశాంత్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, అతని మరణం వెనుక చాలామంది ప్రమేయం ఉందని ఆరోపించింది.
Next Story

