Fri Dec 19 2025 00:30:08 GMT+0000 (Coordinated Universal Time)
Bengaluru Rave Party : సినీ నటి హేమకు వైరల్ ఫీవర్ అట.. విచారణకు రాలేదట
బెంగళూరు పోలీసుల విచారణకు తాను ఈరోజు విచారణకు హాజరు కాలేనని సినీనటి హేమ లేఖ రాశారు

బెంగళూరు పోలీసుల విచారణకు తాను ఈరోజు విచారణకు హాజరు కాలేనని సినీనటి హేమ లేఖ రాశారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమకు బెంగళూరు సీసీబీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. డ్రగ్స్ తీసుకున్నట్లు విచారణలో వెల్లడి కావడంతో నటి హేమకు నోటీసులు ఇచ్చారు. సోమవారం హాజరు కావాలని కోరారు.
కొంత సమయం ఇవ్వాలంటూ...
అయితే తాను ఈరోజు విచారణకు హాజరు కాలేనని, వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నానని సినీ నటి హేమ బెంగళూరు పోలీసులకు లేఖ రాశారు. విచారణకు హాజరు కావడానికి తనకు కొంత సమయం కావాలని హేమ కోరారు. ఆరోగ్యం కుదుట పడిన తర్వాత విచారణకు హాజరవుతానని ఆమె రాసిన లేఖలో పేర్కొన్నారు. దీంతో బెంగళూరు పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.
Next Story

