Fri Dec 05 2025 11:40:23 GMT+0000 (Coordinated Universal Time)
Chips Stealing: 12 ఏళ్ల బాలుడు చిప్స్ దొంగతనం చేశాడని ఆరోపణలు.. చివరికి ఆత్మహత్య
12 ఏళ్ల బాలుడు చిప్స్ దొంగతనం చేశాడని

పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పశ్చిమ మేదినీపూర్ జిల్లా పన్స్కురాలోని గోసైన్బర్ ప్రాంతంలో ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బాలుడు చిప్స్ ప్యాకెట్ దొంగతనం చేశాడని ఆరోపణలు రావడంతో అవమానభారంతో ఆత్మహత్య చేసుకున్నాడు. దుకాణదారుడు దుకాణం నుండి చిప్స్ ప్యాకెట్‌ను దొంగిలించినందుకు బాలుడితో గుంజీలు తీయించాడు. ఆ తర్వాత గురువారం సాయంత్రం 12 ఏళ్ల బాలుడు పురుగుమందు తాగి మరణించాడని పోలీసు అధికారి తెలిపారు.
ఆ బాలుడు ఆ ప్రాంతంలోని స్థానిక పాఠశాలలో చదువుకున్నాడు. అయితే అతని మరణం తరువాత, ఎటువంటి అధికారిక ఫిర్యాదు నమోదు కాలేదు.పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పన్స్కురాలోని ఒక స్వీట్ షాపు యజమాని షువాంకర్ దీక్షిత్ తన దుకాణం నుండి మూడు చిప్స్ ప్యాకెట్లు గాలి కారణంగా ఎగిరిపోయాయని తెలిపాడు. ఆ దారిన వెళుతున్న బాలుడు వాటిని చూసి ఆ ప్యాకెట్లను తీసుకున్నాడు. దీక్షిత్ ఆ బాలుడిని తిట్టి, చెవులు పట్టుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పమని బలవంతం చేశాడు. చిప్స్ ప్యాకెట్లకు 15 రూపాయలు చెల్లించవలసి వచ్చింది. ఈ సంఘటన గురించి తెలుసుకున్న బాలుడి తల్లి కూడా అతన్ని తిట్టి, చెంపదెబ్బ కొట్టిందని పోలీసులు తెలిపారు. దీని తరువాత, బాలుడు పురుగుమందు తాగాడని ఆరోపించారు. అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు, కానీ కొద్దిసేపటికే మరణించాడు.
Next Story

