Sat Mar 07 2026 15:38:01 GMT+0530 (India Standard Time)
Attack On Ys Jagan : దుర్గారావు సతీష్ కు ఎందుకు డబ్బులిచ్చాడంటే..?
జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కు మరో నిందితుడు దుర్గారావు ఆర్థిక సాయం అందించాడని విచారణలో వెల్లడియింది

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కు మరో నిందితుడు దుర్గారావు ఆర్థిక సాయం అందించాడని విచారణలో వెల్లడియింది. సతీష్ పుట్టిన రోజు వేడుకలు చేసుకోవడానికి అవసరమైన డబ్బులు ఇచ్చిన దుర్గారావు రాయిదాడికి పాల్పడాలని ప్రోత్సహించాడని పోలీసులు చెబుతున్నారు. జగన్ పై రాయి దాడి జరిగిన రోజునే సతీష్ పుట్టిన రోజు కావడంతో ఆరోజు డాబా కొట్ల సెంటర్ లో రాయి దాడి జరిగిన తర్వాత కూడా వేడుకలు నిర్వహించుకున్నారని తెలిసింది.
అదే రోజు వేడుకలను...
డాబా కొట్ల సెంటర్ లో సతీష్ పుట్టిన రోజు వేడుకలు చేసుకున్నాడని, దీనికి కొంత ఆర్థిక సాయాన్ని దుర్గారావు అందచేశాడని కూడా చెబుతున్నారు. రాయి దాడి చేస్తేనే తాను డబ్బులిస్తానని సతీష్ కు దుర్గారావు చెప్పడంతో సతీష్ రాయి దాడికి పాల్పడ్డాడని పోలీసులు విచారణలో స్పష్టమయిందంటున్నారు. దుర్గారావును ఈరోజు, రేపట్లో కోర్టులో హాజరుపర్చనున్నారు. స్నేహితులు కూడా సతీష్ కు ఈ విషయంలో సహకరించారని,కానీ వారు మాత్రం రాయి దాడి ఘటనలో పాల్గొన లేదని విచారణలో స్పష్టమయింది.
Next Story

