Mon Mar 16 2026 00:32:25 GMT+0530 (India Standard Time)
హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదం .. ముగ్గురి మృతి
హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు.

హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఆటోను కారు ఢీకొట్టడంతో ముగ్గురు మరణంచారు. పదిహేను మందికి ఈ ప్రమాదంలో తీవ్రగాయాలయ్యాయి. గాయాలపాలయిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో చిన్నారులు కూడా ఉన్నారు.
అతి వేగమే...
అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయాలపాలయిన వారిలో మరికొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు.
Next Story

