Thu Mar 19 2026 19:39:02 GMT+0530 (India Standard Time)
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం .. మహిళ మృతి
తిరుమల మొదటి ఘట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. ఏనుగులు అరుపులు విని భయపడి కారు డ్రైవర్ డివైడర్ ను ఢీకొట్టారు

తిరుమల మొదటి ఘట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. ఏనుగులు అరుపులు విని భయపడి కారు డ్రైవర్ డివైడర్ ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఒక మహిళ మరణించింది. నలుగురికి గాయాలయినట్లు పోలీసులు తెలిపారు. ఘాట్ రోడ్డులో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఒక కుటుంబం కారులో తిరుమలకు శ్రీవారి దర్శనానికి బయలుదేరుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ఏనుగులు అరుపులు విని...
అయితే ఏనుగులు అరుపులు పెద్దగా వినపడటంతో డ్రైవర్ భయపడిపోయి కారును డివైడర్ కు ఢీకొట్టారు. దీంతో డివైడర్ ను ఢీకొట్టిన కారు దూసుకెళ్లి చెట్లుని ఢీకొంది. కారులో ఉన్న మొత్తం నలుగురికి గాయాలయ్యాయి. మహిళ మృతి చెందింది. కారులో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పెద్దలు పిల్లలు గాయాలయ్యాయి.
Next Story

