Mon Oct 07 2024 14:36:21 GMT+0000 (Coordinated Universal Time)
అమరావతిలో మట్టిపెళ్లల కింద ఐదుగురు కార్మికులు
అమరావతి రోడ్డులో ప్రమాదం జరిగింది. ఒక భవనం నుంచి మట్టి పెళ్లలు విరిగిపడటంతో ఐదుగురు కార్మికులు చిక్కుకుపోయారు
గుంటూరు రోడ్డులోని అమరావతి రోడ్డులో ప్రమాదం జరిగింది. ఒక భవనం నుంచి మట్టి పెళ్లలు విరిగిపడటంతో ఐదుగురు కార్మికులు చిక్కుకుపోయారు. అయితే వెంటనే స్థానికులు స్పందించి ముగ్గురు కార్మికులను సురక్షితంగా బయటకు తీశారు. మరొకరు మృతి చెందారు. మరొక కార్మికుడికి తీవ్రగాయాాలయ్యాయి.
పునాదులు తీస్తుండగా....
ఒక భవన నిర్మాణం కోసం పునాదులు తీస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సహాయక కార్యక్రమాలను ప్రారంభించారు.
Next Story