Fri Mar 20 2026 07:35:13 GMT+0530 (India Standard Time)
రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్డ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించారు

యాదాద్రి భువనగిరి ిజిల్లాలో రోడ్డ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించారు. జిల్లాలోని చౌటుప్పల్ మండలం తూప్రాన్ పేట శివారులో ఈ ప్రమాదం జరిగింది. మరమ్మతులకు గురైన వాహనానికి రిపేరు చేస్తుండగా వెనక నుంచి వచ్చిన కంటైనర్ ఢీకొట్టింది. దీంతో వాహనాన్ని మరమ్మతు చేస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
రిపేరు చేస్తుండగా...
మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సును ఓవర్ టేక్ చేయబోయి రోడ్డుపై నిలిపి ఉన్న వాహనాన్ని కంటైనర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. గాయపడిన ఒకరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

