Sun Mar 15 2026 16:04:51 GMT+0530 (India Standard Time)
కొంచరియలు విరిగి పడి ముగ్గురు మృతి
ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. కేదార్నాధ్ కు వెళ్లే దారిలో కొండ చరియలు విరిగిపడి ముగ్గురు భక్తులు మరణించారు

ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. కేదార్నాధ్ కు వెళ్లే దారిలో కొండ చరియలు విరిగిపడి ముగ్గురు భక్తులు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ్ లో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు చర్యలు చేపట్టాయి. భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడటంతో నడక మార్గంలో కేదార్నాధ్ వెళుతున్న భక్తులు ముగ్గురు మరణించారని అధికారులు తెలిపారు.
నడక మార్గంలో...
ఈ ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాలి నడకన వెళ్లే ఈ దారిలో పెద్ద పెద్ద రాళ్లు పడటంతో వాటిని తొలగించే ప్రక్రియను చేపట్టారు. ఈ ఘటనతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం అప్రమత్తమయింది. ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మొహరించి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
Next Story

