Sun Feb 01 2026 22:36:29 GMT+0000 (Coordinated Universal Time)
హోర్డింగ్ పడి ఐదుగురు మృతి
మహారాష్ట్రలోని పూణేలో ఘోర ప్రమాదం జరిగింది. పింప్రి చించ్వాడ్ పట్టణంలో హోర్డింగ్ బోర్డ్ కూలిన ఘటనలో ఐదుగురు చనిపోయారు

మహారాష్ట్రలోని పూణేలో ఘోర ప్రమాదం జరిగింది. పూణేలోని పింప్రి చించ్వాడ్ పట్టణంలో హోర్డింగ్ బోర్డ్ కూలిన ఘటనలో ఐదుగురు చనిపోయారు. మృతుల్లో నలుగురు మహిళలున్నారు. మరో ముగ్గురు గాయపడ్డారు. వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈదురుగాలులకు...
నిన్న వీచిన భారీ ఈదురు గాలులు, వానలకు హోర్డింగ్ పడిపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. హోర్డింగ్ కింద ఉన్న వారిపై హోర్డింగ్ పడటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈదురుగాలులు, భారీ వర్షాలు కురుస్తున్నప్పుడు హోర్డింగ్ ల కింద నిల్చోవద్దని సూచనలు చేసినా పట్టించుకోకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. మృతుల కుటుంబంలో విషాదం నెలకొంది. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియో చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
Next Story

