Thu Mar 19 2026 13:32:35 GMT+0530 (India Standard Time)
ఈతకు దిగి ఐదుగురు మృతి
గుజరాత్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నదిలో పడి ఐదుగురు యువకులు మరణించారు.

గుజరాత్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నదిలో పడి ఐదుగురు యువకులు మరణించారు. బోతాద్ జిల్లాలోని కృష్ణ సాగర్ లేక్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులందరూ పదహారు నుంచి పదిహేడు ఏళ్ల వయసు లోపు వారే. వారిని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి.
కృష్ణ సాగర్ సరస్సులో..
కృష్ణ సాగర్ సరస్సులో ఈత కొట్టేందుకు ఇద్దరు బాలురు వెళ్లగా, వారు ముినిగి పోవడం గమనించి మరో ముగ్గురు పిల్లలు వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో ఆ ముగ్గురు కూడా నీట మునిగారు. దీంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. ఈత రాకుండా సరస్సులోకి దిగడంతో లోతుగా ఉండటం వల్ల ప్రమాదం నుంచి బయటకు రాలేకపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

