Sat Dec 06 2025 16:30:31 GMT+0000 (Coordinated Universal Time)
రోడ్డు ప్రమాదంలో ఇన్ఫోసిస్ ఉద్యోగి మృతి
హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి చెందారు

హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి చెందారు. ఔటర్ రింగ్ రోడ్డులో కారు బోల్తాపడిన ఘటనలో ఇన్ఫోసిస్ ఉద్యోగి సౌమ్యారెడ్డి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరో ఏడుగురికి గాయాలయ్యాయి. ఇన్ఫోసిస్ ఉద్యోగులు అందరూ కలసి సరళ మైసమ్మ ఆలయానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
కారు అదుపు తప్పి...
ఔటర్ రింగ్ రోడ్డులోని అబ్దుల్లాపూర్ మెట్ వద్ద కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో సౌమ్యారెడ్డి అక్కడికక్కడే మరణించారని పోలీసులు తెలిపారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. అలాగే గాయపడిన ఏడుగురిని ప్రయివేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

