Sun Jul 20 2025 01:01:20 GMT+0000 (Coordinated Universal Time)
బొగ్గుగని కూలి నలుగురు కార్మికుల దుర్మరణం
ఝార్ఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. బొగ్గుగని కూలిపోవడంతో నలుగురు కార్మికులు మరణించారు

ఝార్ఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. బొగ్గుగని కూలిపోవడంతో నలుగురు కార్మికులు మరణించారు. ఝార్ఖండ్ లోని రాంగఢ్ జిల్లాలో బొగ్గు గనులను అక్రమంగా తవ్వకాలు జరుపుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బొగ్గు గనిలోని ఒక భాగం కూలిపోయి కార్మికులు మృత్యువాత పడ్డారు. మరో నలుగురు కార్మికులు ఈ ప్రమాదంలో గాయపడినట్లు సమాచారం.
నలుగురికి గాయాలు...
ఇంకా కొందరు బొగ్గుగనిలో చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. కుజు అవుట్ పోస్టులోని కర్మా ప్రాంతంలో ఉన్న సెంట్రల్ కోల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్ కు చెదిన పాడుబడిన బొగ్గుగనిలో ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. అక్రమ తవ్వకాలు జరుపుతూ, సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Next Story