Thu Dec 18 2025 10:13:17 GMT+0000 (Coordinated Universal Time)
తిరుపతిలోని శ్రీనివాస సేతు ప్లై ఓవర్ పనుల్లో ఊహించని ప్రమాదం

తిరుపతిలోని శ్రీనివాస సేతు ప్లై ఓవర్ పనుల్లో భారీ ప్రమాదం జరిగింది. రిలయన్స్ మార్ట్ వద్ద నిర్మిస్తున్న శ్రీనివాస సేతు పనుల్లో భాగంగా సిమెంటు సిగ్మెంట్ ఏర్పాటు చేస్తున్న క్రమంలో క్రేన్ వైర్లు తెగిపోవడంతో ఒక్కసారిగా సెగ్మెంట్ కింద పడిపోయింది. ఇద్దరు కార్మికులు పనిచేస్తుండగా.. ఈ ప్రమాదంలో వారిద్దరు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయినవారిని పశ్చిమ బెంగాల్కు చెందిన అవిజిత్, బీహార్కు చెందిన బార్దోమాండల్గా గుర్తించారు. ఫ్లై ఓవర్ పనులు అతి త్వరలో పూర్తవుతాయనుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
శ్రీనివాస సేతు నిర్మాణ పనుల్లో భాగంగా సమీపంలో ఉన్న రిలయన్స్ మార్టు దగ్గరలో బుధవారం అర్ధరాత్రి సమయంలో రైల్వే బ్రిడ్జి వద్ద క్రేన్ తో ఓ గడ్డర్ సెగ్మెంట్ ను తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. రాత్రి 11.45 గంటల ప్రాంతంలో ఆ సెగ్మెంట్ కింద కార్మికులు బోల్టులు బిగించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ సమయంలో ఒక్క సారిగా జారి కింద పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆప్కాన్స్ సంస్థలో పని చేసే వ్యక్తులు చనిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. డెడ్ బాడీలను ఎస్వీ మెడికల్ కాలేజీలకు తీసుకెళ్లారు.
Next Story

