Fri Jan 30 2026 06:20:00 GMT+0000 (Coordinated Universal Time)
హోలీ రోజున విషాదం.. కొండ చరియలు విరిగిపడి ఇద్దరు మృతి
హిమాచల్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. కొండచరియలు విరిగిపడటంతో జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు మరణించారు.

హిమాచల్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. కొండచరియలు విరిగిపడటంతో జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. హిమాచల్ ప్రదేశ్ లోని హోలా మొహల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. హోలీ పండగ రోజున ఈ ఘటన జరగడంతో అక్కడ విషాదం నెలకొంది. మేడిలో హోలీకి మొహల్లా వేడుక జరుగుతుండగా ఒక్కసారిగా కొండ చరియలు విరిగిపడ్డాయి.
తొమ్మిది మందికి గాయాలు...
ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, గాయలాలపాలయైన వారిని ఉనా ఆసుపత్రికి తరలించారు. చరణ గగావద్ద హోలీ రోజున స్నానాలు చేస్తుండగా కొండచరియలు విరిగిపడటంతో తొక్కిసలాట జరిగింది. దీంతో తొమ్మిది మంది భక్తులు గాయపడ్డారు. పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Next Story

