Sat Mar 07 2026 11:30:10 GMT+0530 (India Standard Time)
Nalgonda : తహసిల్దార్ ఇంట్లో కోట్ల రూపాయల నగదు... కిలోల కొద్దీ బంగారం
నల్లగొండ జిల్లాలోని తహసిల్దార్ ఇంట్లో ఏసీబీ దాడుల్లో అనేక విషయాలు బయటపడుతున్నాయి. కరెన్సీ కట్టలు బయటపడుతున్నాయి

నల్లగొండ జిల్లాలోని తహసిల్దార్ ఇంట్లో ఏసీబీ దాడుల్లో అనేక విషయాలు బయటపడుతున్నాయి. కరెన్సీ కట్టలు బయటపడుతున్నాయి. నల్లగొండ జిల్లా మర్రిగూడ మహేందర్ రెడ్డి ఇంట్లో ఏసీబీ దాడులు జరిగాయి. అందిన సమాచారం మేరకు ఈ దాడులను ఏసీబీ అధికారులు నిర్వహించినట్లు చెబుతున్నారు.
కిలోల కొద్దీ బంగారం...
ఈ దాడుల్లో కోట్లాది రూపాయల నగదు బయటపడింది ఒక ట్రంక్ పెట్టెలో నాలుగు కోట్ల రూపాయల నగదును ఏసీబీ అధికారులు కొనుగొన్నారు. వీటికి లెక్కలు లేవు. సరైన పత్రాలు లేకపోవడంతో ఏసీబీ అధికారులు మహేందర్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటు కిలోల కొద్దీ బంగారాన్ని కూడా ఈ దాడుల్లో కొనుగొన్నట్లు తెలిసింది మొత్తం పదిహేను చోట్ల సోదాలు జరిగినట్లు చెబుతున్నారు.
Next Story

