Sat Dec 06 2025 09:44:30 GMT+0000 (Coordinated Universal Time)
ఈయన ఆస్తులు రూ.50 కోట్లా?
జల్పల్లి మున్సిపల్ కమిషనర్ జీపీ కుమార్ ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.

జల్పల్లి మున్సిపల్ కమిషనర్ జీపీ కుమార్ ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన ఐదు లక్షలు లంచం తీసుకుంటూ నిన్న ఏసీబీ అధికారులకు చిక్కిన సంగతి తెలిసిందే. అయితే జీపీ కుమార్ కు యాభై కోట్ల వరకు ఆస్తులున్నాయని ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. భార్య పేరుతో ఆస్తులను కూడబెట్టారు. రియల్ ఎస్టేట్, కోల్డ్ స్టోరేజీ, లగ్జరీ చీరల వ్యాపారంలో జీపీ కుమార్ పెద్దయెత్తున పెట్టబడులు పెట్టారని ఏసీబీ విచారణలో వెల్లడయింది.
ఎనిమిది చోట్ల...
జల్పల్లి మున్సిపల్ కమిషనర్ జీపీ కుమార్ గతంలో ఒక మంత్రి వద్ద పీఏగా పనిచేశారు. ఆ సమయంలోనే ఇన్ని ఆస్తులను కూడబెట్టారని తెలిసింది. దాదాపు ఎనిమిది చోట్ల ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. కమిషనర్ పీఏ అంజన్ తో పాటు డ్రైవర్ యూసఫ్ ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరి బ్యాంకు లాకర్స్ లో కూడా భారీగా నగదు, ఆస్తిపత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
Next Story

