Thu Feb 02 2023 01:18:35 GMT+0000 (Coordinated Universal Time)
సెల్ఫీ కోసం నాగుపామును మెడలో వేసుకుని?
నెల్లూరు సాయిమణికంఠ అనే యువకుడు విన్నూత్న తరహాలో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకున్నాడు.

సెల్ఫీలు తీసుకోవడం ఇప్పటి యువతకు మోజుగా మారింది. సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం అలవాటుగా మ ారింది. అనేక మంది సెల్ఫీలు తీసుకుంటూ ప్రమాదంలో పడి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కూడా చూశాం. రైలు వస్తున్నప్పుడు రైల్వే ట్రాక్ మీద, నీటిలో లోతు తెలియకుండా సెల్ఫీ కోసం దిగి ప్రాణాలు కోల్పోయిన యువతీ యువకులను మనం దేశంలో ఎక్కడో చోట వింటూనే ఉంటాం.
చికిత్స పొందుతూ...
కానీ నెల్లూరు సాయిమణికంఠ అనే యువకుడు విన్నూత్న తరహాలో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. నెల్లూరు జిల్లాలో ఈ ఘటనకు జరిగింది. సాయిమణికంఠ అనే యువకుడు నాగుపామును మెడలో వేసుకుని సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశాడు. అయితే నాగుపాటు కాటు వేయడంతో మణికంఠను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ సాయిమణికంఠ మరణించారు. వారి కుటుంబంలో విషాదం మిగిలింది.
Next Story