Mon Sep 09 2024 11:54:04 GMT+0000 (Coordinated Universal Time)
15రోజుల్లో ఇండియా రావాల్సి ఉండగా మృతి
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన యువకుడు మృతి చెందాడు.
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన యువకుడు మృతి చెందాడు. సూర్యపేట జిల్లాకు చెదిన నరేంద్రుని చిరు సాయి పదకొండు నెలల క్రితం చదువు నిమిత్తం అమెరికాకు వెళ్లారు. అక్కడ చదువు పూర్తయి వచ్చే నెల 15వ తేదీన ఇండియాకు తిరిగి వచ్చే ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. ఇండియాకు వస్తున్న సందర్భంలో షాపింగ్ వెళ్లిన సాయి కారు ప్రమాదంలో మృతి చెందాడు.
రోడ్డు ప్రమాదంలో...
భారీగా మంచుకురుస్తుండటంతో సాయి ప్రయాణిస్తున్న కారు టిప్పర్ ను ఢీకొనింది. సాయి అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న మరో యువతి తీవ్ర గాయాలపాలై కోమాలో ఉంది. సూర్యాపేట జిల్లా నల్లాల బావికి చెందిన నరేంద్రుని లింగమూర్తి, సుధారాణి కుమారుడు సాయి. సాయి మృతితో ఆ గ్రామంలో విషాద చాయలు అలుము కున్నాయి. సాయి మృతదేహాన్ని అమెరికా నుంచి ఇండియా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story