Tue Mar 03 2026 17:46:43 GMT+0530 (India Standard Time)
అమెరికాలో కాల్పులు... తెలంగాణ యువకుడు మృతి
అమెరికాలో నల్లజాతీయులు జరిపిన కాల్పుల్లో నల్లగొండ జిల్లాకు చెందిన యువకుడు మరణించాడు

అమెరికాలో నల్లజాతీయులు జరిపిన కాల్పుల్లో నల్లగొండ జిల్లాకు చెందిన యువకుడు మరణించాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. మేరీల్యాండ్ రాష్ట్రంలో నక్కా సాయి చరణ్ నల్లజాతీయుల చేతుల్లో కాల్పులకు గురయ్యాడు. సాయిచరణ్ అక్కడికక్కడే మరణించాడు. ఆదివారం సాయంత్రం స్నేహితుడిని ఎయిర్ పోర్టులో దించి తిరిగి కారులో వస్తుండగా ఒక్కసారిగా సాయిచరణ్ పై నల్లజాతీయులు కాల్పులు జరిపారు.
నల్లజాతీయుల కాల్పుల్లో...
ఈ ఘటనలో సాయిచరణ్ అక్కడికక్కడే మరణించాడు. సాయిచరణ్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. రెండేళ్లుగా మేరీల్యాండ్ లోని బాల్టిమోర్ లో నివాసం ఉంటున్నాడు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. సాయిచరణ్ భౌతిక కాయాన్ని భారత్ కు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడ తెలుగు అసోసియేషన్లు ప్రయత్నిస్తున్నాయి. త్వరగా సాయిచరణ్ భౌతిక కాయాన్ని భారత్ కు చేర్చేందుకు సాయం చేయాలని కుటుంబ సభ్యులు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Next Story

