Sun Feb 01 2026 22:08:33 GMT+0000 (Coordinated Universal Time)
యూపీలో దుర్ఘటన.. ఎనిమిది మంది మృతి
ఉత్తర్ ప్రదేశ్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. నదిలో ట్రాక్టర్ పడి ఎనిమిది మంది మరణించారు

ఉత్తర్ ప్రదేశ్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. నదిలో ట్రాక్టర్ పడి ఎనిమిది మంది మరణించారు. సహాయక బృందాలు కొందరిని కాపాడాయి. ఉత్తర్‌ప్రదేశ్ లోని హర్దోయి జిల్లాలో ఈ దుర్ఘటన జరిగింది. బేగ్రాజ్ పూర్ గ్రామానికి చెందిన రైతులు నిజాపంుర్ పులియా మండికి వెళ్లి తమ ఉత్పత్తులు అమ్మి తిరిగి వస్తున్నారు. అయితే గర్రా నదిపై నిర్మించిన వంతెనపై రెయిలింగ్ లేకపోవడంతో ట్రాక్టర్ అదుపు తప్పి నదిలో పడిపోయింది. ప్రమాద సమయంలో అందులో 25 మంది వరకూ రైతులు ఉన్నారని ప్రతక్ష్య సాక్షులు చెబుతున్నారు.
కొందరిని కాపాడినా...
నదిలో ట్రాక్టర్ బోల్తా పడిన సమాచారం తెలుసుకున్న స్థానికులు కొందరిని రక్షించగలిగారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వారిని కాపాడటం కష్టంగా మారింి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సంఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. 14 మందిని రక్షించాయి. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియో ప్రకటించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

