Sun Mar 15 2026 03:44:53 GMT+0530 (India Standard Time)
భారీ పేలుడు.. 20 మంది మృతి
ఆప్ఫనిస్థాన్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దేశ రాజధాని కాబూల్ లో భారీ పేలుడు సంభవించి 20 మంది మరణించారు.

ఆప్ఫనిస్థాన్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దేశ రాజధాని కాబూల్ లో భారీ పేలుడు సంభవించి 20 మంది మరణించారు. కాబూల్ లోని ఖైర్ఖానా ప్రాంతంలోని ఒక మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో మసీదు ఇమామ్ తో సహా ఇరవై మంది అక్కడకికక్కడే మరణించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
మృతుల సంఖ్య...
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలిసింది. కాబూల్ ఉత్తర ప్రాంతంలో భారీ పేలుడు సంభవించిందని, పేలుడు తీవ్రత అధికంగా ఉందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. అయితే ఈ దారుణానికి ఎవరు పాల్పడారన్నది ఇంకా తెలియరాలేదు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తు బృందాలు ఈ ఘటనపై విచారణ చేపట్టాయి.
Next Story

