Sun Mar 15 2026 12:53:29 GMT+0530 (India Standard Time)
రాజమండ్రిలో విషాదం.. ఒకరి మృతి
దీపావళి పండగ రోజు రాజమండ్రిలో విషాదం చోటు చేసుకుంది. బాణాసంచా పేలి ఒకరు మృతి చెందారు

దీపావళి పండగ రోజు రాజమండ్రిలో విషాదం చోటు చేసుకుంది. బాణాసంచా పేలి ఒకరు మృతి చెందారు. బాణాసంచా తయారు చేస్తున్న సమయంలో పేలుడు జరిగింది. తమ కుటుంబం కోసం బాణాసంచా తయారు చేస్తుండగా ఈ పేలుడు జరిగింది. మూడో అంతస్థులో ఉన్న కోటేశ్వరరావు అనే వ్యక్తి మరణించారు.
పేలుడు ధాటికి...
పేలుడు ధాటికి ఇల్లు కూడా ధ్వంసమయింది. దీంతో స్థానికులు బయటకు పరుగులు తీశారు. మరణించిన వ్యక్తికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీపావళి పండగ రోజు విషాదం చోటు చేసుకోవడంతో స్థానికులు భయపడిపోతున్నారు. వెంటనే పోలీసులు వచ్చి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

