Thu Mar 19 2026 23:58:39 GMT+0530 (India Standard Time)
Breaking: లోయలో పడిన బస్సు.. 11 మంది మృతి
ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పదకొండు మంది అక్కడికక్కడే మరణించారు

ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పదకొండు మంది అక్కడికక్కడే మరణించారు. టూరిస్ట్ లతో వెళుతున్న బస్సు లోయలో పడటంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్ లోని చమోలి దగ్గర లోయలో బస్సు పడింది. ఈ ఘటనలో అనేక మందికి గాయాలయ్యాయి.
అతివేగమే...
700 మీటర్ల లోయలో బస్సు పడటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలిసింది. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

