Thu Mar 19 2026 23:57:28 GMT+0530 (India Standard Time)
ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి
ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది భక్తులు మరణించారు

ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది భక్తులు మరణించారు. ఉధమ్ సింగ్ నగర్ జిల్లా కిచ్చా సమీపంలో వెళుతున్న వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎనిమంది అక్కడికక్కడే మరఠనించారు. 37 మంది గాయపడడ్డారు. భక్తులతో ఉన్న ట్రాలీ తిరగబడటంతోనే ఈ ప్రమాదం జరిగింది. వెంటనే పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని సహాయ కార్కక్రమాలు చేపట్టారు.
లారీ ఢొకొట్టడంతో...
ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉధమ్ సింగ్ నగర్ జిల్లా శక్తి ఫారం ప్రాంతానికిచెందిన బాస్గర్ గ్రామానికి చెందిన 45 మంది గురుద్వారాకు ట్రాలీలో వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. గురుగ్రంధ సాహిబ్ పారాయణంలో పాల్గొనేందుకు వెళుతుండగా ట్రాలీ బోల్తా పడింది. వెనక నుంచి వచ్చిన లారీ వేగంగా ట్రాలీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

