Mon Mar 23 2026 01:24:11 GMT+0530 (India Standard Time)
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురి మృతి
ఉత్తర్ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు

ఉత్తర్ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. ఉన్నావ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన ఒక లారీ పాదచారులపైకి అనంతరం కారును ఢీకొట్టడంతో ఆరుగురు మరణించారు. రోడ్డు దాటుతున్న ముగ్గురు, కారులో ఉన్న మరో ముగ్గురు ఈ ఘటనలో మరణించారు.
అతి వేగంగా...
అతి వేగంగా వచ్చి ఢీకొట్టడం వల్లనే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగింది పోలీసులు అంటున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డంపర్ లో ఇరుక్కున్న వారిని బయటకు తీయడానికి క్రేన్లను ఉపయోగించాల్సి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Next Story

