Fri Mar 20 2026 20:50:22 GMT+0530 (India Standard Time)
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి
ఉత్తర్ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు

ఉత్తర్ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. లఖీంపూర్ఖేరీ లో ఈ దుర్ఘటన జరిగింది. బస్సు, ట్రక్కు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇరవై ఐదు మందికి తీవ్ర గాయాలయినట్లు పోలీసులు చెబుతున్నారు.
అతి వేగమే...
క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి అతి వేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు కొంత బాధితులను రక్షించే ప్రయత్నం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

