Fri Mar 20 2026 20:49:01 GMT+0530 (India Standard Time)
ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 22 మంది మృతి
ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 22 మంది మృతి చెందారు

ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 22 మంది మృతి చెందారు. ఘతంపూర్ లో ఈ ఘటన జరిగింది. భక్తులతో వెళుతున్న ట్రాక్టర్ అదుపు తప్పి చెరువులో బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. మరో పదిహేను మందికి పైగా గాయపడ్డారు. పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుప్రతికి తరలించారు. అతి వేగమే ప్రమాదానానికి కారణమని పోలీసులు చెబుతున్నారు.
ఆలయంలో...
బాధితులంతా చంద్రికా దేవి ఆలయంలో పూజలు చేసుకుని తిరిగి తమ స్వగ్రామమైన కోర్తాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టర్ లో 50 మంద వరకూ ఉన్నారని, వీరిలో 22 మంది చనిపోయారని పోలీసులు తెలిపారు. ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతిని ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలకు రెండు లక్షల ఎక్స్‌గ్రేషియో, గాయపడిన వారికి యాభై వేల రూపాయలు ప్రకటించారు.
Next Story

