Mon Oct 07 2024 13:45:41 GMT+0000 (Coordinated Universal Time)
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి
కర్ణాటకలోని తుముకూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించారు.
కర్ణాటకలోని తుముకూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించారు. 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. తముకూరు జిల్లాలోని కలకంబెల్లా సమీపంలో ఈరోజు తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. కారు, లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరణించిన వారంతా రాయచూరు జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
అంతా కూలీలే...
మరణించిన వారిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. తముకూరు జిల్లా నుంచి బెంగళూరుకు కూలీ పనుల కోసం వెళుతున్న వీరు ప్రమాదానికి గురయ్యరు. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story