Mon Mar 16 2026 07:50:07 GMT+0530 (India Standard Time)
Road Accident : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
తెలంగాణ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు

తెలంగాణ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టడంతో ఈ ఘటన జరిగింది. బస్సులో ఉన్న అనేక మంది గాయాలపాలయ్యారు.
కేసు నమోదు చేసి...
పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణాలపై ప్రయాణికులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు మృతులు ఎవరన్నది ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story

