Tue Mar 17 2026 13:49:20 GMT+0530 (India Standard Time)
Breaking : తమిళనాడులో ఘోర ప్రమాదం.. ముగ్గురు అయ్యప్ప స్వాముల మృతి
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు.

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. వీరు అయ్యప్ప భక్తులుగా గుర్తించారు. శబరిమలలో అయ్యప్పస్వామిని దర్శించుకుని తిరిగి వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైందని తెలిసింది. అందుతున్న సమాచారం ప్రకారం ముగ్గురు మరణించగా మరికొందరు గాయపడినట్లు తెలిసింది.
మృతులంతా...
మరణించిన ముగ్గురు అయ్యప్ప స్వాములు ములుగు జిల్లాకు చెందిన కమలాపురం గ్రామానికి చెందిన వారుగా చెబుతున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి పంపి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటన స్థలికి వద్దకు పోలీసులు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Next Story

