Thu Mar 19 2026 19:58:57 GMT+0530 (India Standard Time)
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం... ఆరుగురి మృతి
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు.

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. తమిళనాడులోని సేలం జిల్లాలో అత్తూరు వద్ద ఈ ప్రమాదం జరిగింది. బస్సును ఒక వ్యాన్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. కొందరు గాయపడ్డారు.
అతి వేగమే...
గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రమాదానికి అతి వేగమే కారణం అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

