Thu Mar 19 2026 05:49:08 GMT+0530 (India Standard Time)
ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి
రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు

రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. రాజస్థానల్ లోని సుమేర్ పుర్ పోలీస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ట్రాక్టర్ ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించగా, 20 మంది వరకూ గాయపడ్డారు. గాయపడిన వారిని సుమేర్ పుర్, శివగంజ్ ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
అతివేగమే...
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలికి వెళ్లి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. జైసల్మేర్ జిల్లాలోని రామ్ దేవ్ ఆలయానికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. వేగంగా వచ్చిన ట్రక్కు ట్రాక్టర్ ను ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.
Next Story

