Fri Mar 20 2026 20:23:17 GMT+0530 (India Standard Time)
రాజస్థాన్ ఘోర రోడ్డు ప్రమాదం : 5గురు మృతి
రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు.

రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. కారును లారీ ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. హనుమాన్ గఢ్ జిల్లా పల్గూ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటుకల లోడుతో వస్తున్న లారీ బస్రాసర్ గ్రామ సమీపంలో బలంగా కారును ఢీకొట్టింది.
లారీ - కారు ఢీ...
దీంతో కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు ఆసుపత్రి తరలిస్తుండగా మృతి చెందారని పోలీసులు తెలిపారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడు. అయితే మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

