Sun Oct 06 2024 01:57:28 GMT+0000 (Coordinated Universal Time)
ఘోర ప్రమాదం ... ఐదుగురి మృతి
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొన్న సంఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొన్న సంఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రకాశం జిల్లాలోని కంభం సమీపంలోని వాసవి పాలిటెక్నిక్ కళాశాల వద్ద లారీని వెనక నుంచి కారు ఢీకొంది. అనంతపురం - అమరావతి జాతీయ రహదారిపై సిమెంట్ లోడుతో ఉన్న లారీని కారు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
తిరుమలకు వెళుతూ...
మృతులు పల్నాడు జిల్లాలోని వెల్దుర్తి మండలం సిరిగిరిపాడుకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. మృతులు అనిమిరెడ్డి, గురవమ్మ, అనంతమ్మ, ఆదిలక్ష్మి, నాగిరెడ్డి లుగా గుర్తించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో లారీ డ్రైవర్ కు తీవ్రగాయాలయ్యాయి. వీరంతా తిరుమల దైవదర్శనానికి బయలు దేరారని, మార్గమధ్యంలో ఈ ప్రమాదం జరిగిందని మృతుల బంధువులు బోరున విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story